Thu. Oct 29th, 2020

E69 news

News

ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్యలు విద్యాశాఖ పరిధిలోకి రాదా ?

ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్యలు విద్యాశాఖ పరిధిలోకి రాదా ?

ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్యలు విద్యాశాఖ పరిధిలోకి రాదా ?

రాష్ట్రంలో ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్యా శాఖలలో చేయుచున్న ఉద్యోగులు ఈ విషయం మీద స్పష్టత కోరుచున్నారు ఎప్పుడో 2017వ సంవత్సరంలో జరిగిన సాధారణ బదిలీలు అనంతరం ప్రస్తుత ప్రభుత్వం గత సంవత్సరం సాధారణ బదిలీలను విద్యాశాఖకు మాత్రం మినహాయించి మిగిలిన శాఖలకు 2019వ సంవత్సరంలో బదిలీలను నిర్వహించారు దింతో పై రెండు శాఖలలో పని చేయుచున్న ఉద్యోగులు బదిలీ అవకాశం లేకుండా గత 3 సంవత్సరాలుగా పని చేయుచున్నారు గత సంక్రాంతికి విద్యాశాఖలో బదిలీలు నిర్వహిస్తామని సంబంధిత మంత్రి ప్రకటనతో ఇతర విద్యాశాఖ ఉద్యోగుల మాదిరిగా సాధారణ బదిలీలపై అంశం ప రెండు శాఖల ఉద్యోగుల కూడా ఎదురు చూడటం జరిగింది సుదీర్ఘ కాలయాపన అనంతరం ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి గ్రీన్ signl ఇచ్చిన అనంతరం ప్రాథమిక విద్యాశాఖ ఉద్యోగులకు మాత్రం బదిలీలకు కార్యాచరణ ప్రకటించియున్నారు . కానీ ఈ సారి కూడా ఉన్నత మరియ సాంకేతిక విద్యాశాఖలలో పనిచేయుచున్న సిబ్బంది బదిలీలకు సంబంధించిన ఊసే లేదు గత సంవత్సరం నిర్వహించిన సాధారణ బదిలీలో విద్యాశాఖకు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం పై రెండు శాఖల ఉద్యోగులకు బదిలీలు నిర్వహించలేదు ఇప్పుడు విద్యాశాఖ ఇద్యోగులకు బదిలీలు నిర్వహించడానికి కార్యచరణ ప్రకటించిన ప్రభుత్వం పై రెండు శాఖల ఉద్యోగుల బదిలీలకు సంభవించింన ఎటువంటి ఊసే లేకపోవటంతో మేము విద్యాశాఖ క్రిందికి రావా అని ప్రశ్నిస్తున్నారు తమ పరిస్థితి పొలుపోక తమకు బదిలీలు ఎప్పుడు ఉంటాయో తేలిక దీర్ఘకాలిక బదిలీల కోసం ఎదురు చూడటం జరుగుతుంది కనీసం క్లియర్ వికెన్స్ లు మరియు పరస్పర అంగీకార బదిలీల కైనా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటిస్తే పై రెండు శాఖలతో ఉద్యోగుల కు నిజాయితీగా మరియు పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అవకాశం ఇచ్చినట్లువుతుందని లేనిచో అధికార పార్టీ నేతల సిఫార్సు లతో విచక్షణాధికారం బదిలీలకు పై రెండు శాఖలు ఉద్యోగులు తెగబడే అవకాశం లేక పోలేదు ఈ దిశగా ఇప్పటికే పలువురు ఉద్యోగులు సచివాలయం మరియు నేతల చుట్టూ ప్రదక్షణ చేయుచున్నారు