దేశానికి అన్నం పెట్టే రైతులను చంపటామా? వేపూరీ సుధీర్

ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ వద్ద ఆందోళన చేస్తోన్న రైతుల మరణానికి కారణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ,మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు మీద మోడీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని ఉత్తరప్రదేశ్‌ హక్కుల కోసం పోరాడుతున్న రైతుల పైన కేంద్ర సహాయ మంత్రి కుమారుడు తన వాహనంను రైతుల పైకి దారుణంగా దూసుకువెళ్లి ఆరుగురి రైతుల మృతికి చెందిన సంఘటన దానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుధీర్ మోడీ యోగి ప్రభుత్వాన్ని దుయ్యబుట్టారు.అంబానీ అదానీ లలిత్ మోడీ నీరవ్ మోడీ వంటి కుబేరులకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ రైతుల హక్కులను కాలరాస్తున్నారని రైతు వ్యతిరేక బీజేపీటీఆర్ఎస్ ప్రభుత్వాలను రాబోయే రోజుల్లో పొలంలో కలుపు మొక్క వలే కూకటి వేలతో పెకేలిస్తారని ధీమావ్యక్తం చేశారు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పోరాడుతుంటే వారిని పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయటం సిగ్గుమాలిన చర్య అన్ని రైతులకు న్యాయం జరిగే వరకు వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఎన్నడూ లేని విధంగా దేశంలో రాష్ట్రంలో రైతులపై దాడులు అక్రమార్కులు పెరిగాయన్నారు కార్యక్రమంలో పవన్ మదు వెంకటేశ్వర్లు మహేష్ గోపీ నికీల్ రాహుల్ వంశీ నాని రాము వైద్యులు నలమాద వీరబాబు విజయ్ సాయి శ్రీకాంత్ వంశీ మధు సైదులు మురళీ శ్రీరాములు వెంకన్న కాశీ రియాజ్ రైతులు యువకులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *