Thu. Oct 29th, 2020

E69 news

News

మాజీ శాసనసభ్యులు,MCPI(U) వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి 12 వ వర్ధంతి

మాజీ శాసనసభ్యులు,MCPI(U) వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి 12 వ వర్ధంతి

మాజీ శాసనసభ్యులు,MCPI(U) వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి 12 వ వర్ధంతి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులు,MCPI(U) వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి 12 వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 15 నుంచి 31 వరకు “కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయక, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు,నిరసనలు చేయాలని MCPI(U) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.అందులో భాగంగా ఇదే అంశంపై ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాద్ బాగ్లింగంపల్లి లోని ఓంకార్ భవన్ ,B.N. హాల్ లో. జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా MCPI(U)జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ M.D. గౌస్ గారు హాజరై ఓంకార్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రధాన వక్తగా మాట్లాడారు. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, చెరుపల్లి సీతారాములు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పర్ష పద్మ, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్,SUCI (U) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జె వి చలపతి రావు, BLF రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ CPI ML గుర్రం విజయ్ కుమార్, ప్రసాదన్న,పర్వతాలు,సదానందం తదితరులు ప్రసంగించారు. కామ్రేడ్ ఉపేందర్ రెడ్డి గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఇంకా వనం సుధాకర్,టి అనిల్ కుమార్, ఎర్ర రాజేష్,పురుషోత్తం, ఎం. రమేష్ తుకారాం నాయక్ మల్లేష్,కన్నా శ్రీనివాస్,పుష్ప, భాగ్యమ్మ,యాదగిరి,పల్లె మురళి,మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.