CITU JANGAMA NEWS

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
—వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా
— వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని —-జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు గారికి అందజేసిన నాయకులు

జనగామ: అంగన్వాడీ ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సోమవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులు అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు గారికి అంగన్వాడి యూనియన్ నాయకులు అందజేశారు
ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమానికి అంగన్వాడి యూనియన్ జిల్లా కన్వీనర్ మచ్చ శారద అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను పట్టించుకోవడం లేదు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు నెలల తరబడి గ్యాస్ బిల్లలు చెల్లించక ప్రభుత్వం అంగన్ వాడి ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు టి ఏ లూ డిఎ లు ఇవ్వడంలేదని మండిపడ్డారు అంగన్వాడి ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు పిఎఫ్ ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు వేతనంలో సగం పెన్షను నిర్ణయించాలని అన్నారు 45వ ఐ ఎస్ సి సిఫార్సుల ప్రకారం కనీస వేతనం పెన్షను’ ఈ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఐ సి డి ఎస్ సి స్కీం ను ప్రైవేటీకరణ చేయకూడదని అన్నారు ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని ఐసిడిఎస్ కు నష్టం కలిగించే నూతన విద్యా విధానం చట్టంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ ఉద్యోగుల పై పని భారం మోప కూడదని అన్నారు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జోగు ప్రకాష్ జిల్లా నాయకులు సుంచు విజేందర్ దూసరి నాగరాజు అంగన్వాడి టీచర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా మండల నాయకులు కే రాజకళ , టీ రాజేశ్వరి పి సరిత సిహెచ్ విజయ ఎండి జరీనా బేగం జగదీశ్వరి ఉమ వినోద, నాగలక్ష్మి , జయమ్మ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.