jangama news telugu news citu news

అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కన్వీనర్ మచ్చ శారద
~~~~
జనగామ: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జూలై 11న రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్ వాడి టీచర్స్& హెల్పర్స్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్; హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ అంగన్వాడి టీచర్స్& హెల్పర్స్ యూనియన్(CITU) జిల్లా కన్వీనర్ మచ్చ శారద కోరారు
శనివారం జిల్లా కేంద్రంలో అంగన్వాడీ యూనియన్ నాయకులతో కలిసి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు వేతనంలో సగం పెన్షను నిర్ణయించాలని అన్నారు 45వ ఐ ఎస్ సి సిఫార్సుల ప్రకారం కనీస వేతనం పెన్షను’ ఈ ఎస్ ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఐ సి డి ఎస్ సి స్కీం ను ప్రైవేటీకరణ చేయకూడదని అన్నారు ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని ఐసిడిఎస్ కు నష్టం కలిగించే నూతన విద్యా విధానం చట్టంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ ఉద్యోగుల పై పని భారం మోప కూడదని అన్నారు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూలై 11న సోమవారం రోజున జరిగే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా మండల నాయకులు ఇల్లందుల జయ ,ఇంతల వినోద, టీ నాగలక్ష్మి ,టి సంపతి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.