అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు

సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో సామూహిక సీమంతాలు//ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక సుందరయ్య నగర్ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ రాధా ఆధ్వర్యంలో నేడు సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ యుపి సిడిపిఓ వనజ హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ లో భాగంగా గర్భిణీ లకు గర్భవతులు అయిన మూడు నెలలకు అంగన్వాడి కేంద్రాలకు ఆహ్వానం పలికి సీమంతాల కార్యక్రమం నిర్వహించి గర్భం ధరించిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలని టీటీలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని, నార్మల్ డెలివరీ కి ఏ.యన్. యమ్. లు అంగన్వాడీ టీచర్లు వారికి అవగాహన కల్పించవలెనని అది కూడా ప్రభుత్వ హాస్పిటల్ నంది డెలివరీలు జరిగేలా ప్రోత్సహించవలెనని అన్నారు. అలాగే అంగన్వాడీలో ఇచ్చే ఒక పూట సంపూర్ణ భోజనం కూడా తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలోని తినవలెనని సిడిపిఓ గర్భిణీలకు సూచించారు. అనంతరం 50 మంది గర్భిణీలకు భోజనం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత సర్కిల్ సూపర్ వైజర్ ఫరా, ఏఎన్ఎం తులసి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ ఆస్వాక్, ఆశా వర్కర్లు, తల్లుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.