E69news జనగామ జూన్18
బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షులు శానబోయిన మహపాల్ వివాహ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ శుభ కార్యక్రమానికి బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు అరుట్ల దశ్మంత్ రెడ్డి,జిల్లా బిజెపి ఇంచార్జ్ పాపారావు,బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి నూతన దంపతులను నిండు నూరేళ్ళు హాయిగా సంసార జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు.
వారి వెంట బిజెపి జిల్లా సీనియర్ నాయకుడు ఇనుగాల యుగందర్ రెడ్డి, జనగామ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్,బిజెపి జనగామ జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతి గౌడ్ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్,బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకుడు పులి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.