అంగ రంగ వైభోగంగా గ్రామదేవతల తిరునాళ్ళ మహోత్సవాలు

ముప్పాళ్ళ గ్రామంలో అంగ రంగ వైభోగంగా గ్రామదేవతల తిరునాళ్ళ మహోత్సవాలు
చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో ఈ నెల 25వ తారీకు నుంచి 29వ తారీకు శ్రీ ముప్పాళ్ల మ్మ తల్లి అంకమ్మ తల్లి తిరుణాల మహోత్సవాలు అంగ రంగ వైభోగంగా జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ ఆచారాల ప్రకారం ఈ సంవత్సరం కూడా గ్రామదేవతల తిరునాళ్ళ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమాలు మొదటిరోజు అమ్మవారి నిధి ఎక్కటం.మూడో రోజు జల బిందెల కార్యక్రమాలు. నాలుగో రోజు ఆర్యవైశ్య బ్రాహ్మణ బోనాలు కార్యక్రమం. ఐదు వ రోజు అన్ని కులాల వారు బోనాలు సమర్పిస్తారు. ఈ ఐదు రోజులు జరిగే ఈ కార్యక్రమమునకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అలాగే ఈ ఐదు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.