మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని పురుషోత్తమాయ గూడెం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి నిర్మించిన శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ను ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నూకల నరేష్ రెడ్డి, సర్పంచ్ అభినవ్ రెడ్డి, మంచు అశోక్, తదితరులు పాల్గొన్నారు