అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’ - జంగా రాఘవరెడ్డి

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారు డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. అంబేద్కర్ జయంతి ఇవాళ.. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తోంది.

డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్.. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన.

కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి. నేడు (ఏప్రిల్ 14) ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతావని నివాళులు అర్పిస్తోంది.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ గారు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సారవల్ల నర్సింగరావు గారు, జిల్లా యూత్ అధ్యక్షులు శివరాజ్ యాదవ్ గారు, పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాజేష్ నాయక్ గారు, ఉపాధ్యక్షులు కళ్యాణం ప్రవీణ్ కుమార్ గారు, జనగామ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త కర్ణకర్ రెడ్డి, అధికార ప్రతినిధులు మేడ శ్రీను, రంగరాజు ప్రవీణ్ కుమార్ గార్లు, రాం దయాకర్ రెడ్డి గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడేపాక రాంచందర్ గారు, కౌన్సిలర్లు ముస్యాల చందర్ గారు, జనగామ పట్టణ ఉపాధ్యక్షులు ఎండీ గౌస్ పాషా గారు, మోర్తల ప్రభాకర్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీ రాం శ్రీనివాస్ గారు, పట్టణ కార్యదర్శులు బల్దే ఆంజనేయులు గారు, బోరెల్లి సిద్ధులు గారు,వెంకటరెడ్డి గారు, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు మేకల స్వామి గారు, పాలకుర్తి నియోజకవర్గ యువత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.