మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తు పిసి అర్ పాపారావు గత సంవత్సరం గుండె పోటు తో మరణించగా అతని భార్య అర్ లక్ష్మి మరియు కుటుంబ సభ్యులకు భద్రత ద్వారా వచ్చిన రూ.3,81,520/-భద్రత చెక్* ను మహబూబాబాద్ జిల్లా *ఎస్పీ శరత్ చంద్ర పవార్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ శరత్ చంద్రపవార్ అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతోపాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ శరత్ చంద్రపవార్ దైర్యం చెప్పారు.