అంబేద్కర్ చిత్రపటాన్ని గణతంత్ర దినోత్సవం నాడు పెట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి … గత రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రజా చైతన్యం యాత్ర అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ , జాతీయ సలహాదారులు మల్లి రాజు (జనగామ పట్టణ ఉపాధ్యక్షులు) , జిల్లా కార్యదర్శి ఉడుగుల సాగర్ ఆమరణ నిరాహార దీక్ష కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో గణతంత్ర దినోత్సవం నాడు పెట్టకపోవడం రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెట్టడాన్ని విమర్శించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

భారత దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం ని అందించిన  గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చి రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ , డాక్టర్ రాజమౌళి
మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి , జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ నల్ల శ్రీరామ్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు , డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదెపాక రామచంద్ర , కౌన్సిలర్లు వంగల కళ్యాణి మల్లారెడ్డి, మంత్రి అనిత , మల్లి  చంద్రకళ , బాల్దే కమలమ్మ , రామగళ్ళ అరుణవిజయకుమార్ , జక్కుల అనిత వేణుమాధవ్ , ముస్యాల చందర్ , జనగామ పట్టణ ఉపాధ్యక్షులు మోర్తల ప్రభాకర్ , బీసీ సెల్ అధ్యక్షులు మంత్రి శ్రీశైలం , పట్టణ ప్రధాన కార్యదర్శి బాల్డే ఆంజనేయులు , మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజారుద్దీన్ , చక్రి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.