అంబేద్కర్ 130 వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 130 వ జయంతి సందర్బంగా ఈ రోజు మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం(MPDO)లో మరిపెడ మండల పరిషత్ అధ్యక్షురాలు(MPP) గుగులోతు అరుణరాంబాబు నాయక్ గారు జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్ నాయక్ గారితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎంపీపీ గారు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పర్యటించి కరోనా నివారణకు ప్రభుత్వం చేస్తున్న సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని,45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ప్రజలను కొరారు.అందరూ మాస్కులు ధరించి భూతిక దూరం పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO)శ్రీ సింగారపు కుమార్ గారు,డాక్టర్ అరుణదేవి గారు,mpo పూర్ణచందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.