అక్రమాలకు పాల్పడుతున్న ఎంవిఐ లను సస్పెండ్ చేయాలి:డివైఎఫ్ఐఅక్రమాలకు పాల్పడుతున్న ఎంవిఐ లను సస్పెండ్ చేయాలి:డివైఎఫ్ఐ

హనుమకొండ వరంగల్ ఆర్టిఏ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేసి బాధ్యులైన ఎం వి ఐ లను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నోముల కిషోర్ దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ ….ఆర్టిఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవిఐ) ల తీరు చర్చనీయంగా ఉందని ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని చుక్కలేందే ఏ పని ముట్టుకునే పరిస్థితి లేదని, వాహనదారులు లైసెన్స్ కోసం ఆఫీసుకు వెళ్తే ఏజెంట్ల ద్వారా వెళ్ళిన వారికే తొందరగా లైసెన్స్ జారీ అవుతుందని నేరుగా వెళ్లిన వారినీ ముప్పు తిప్పలు పెడుతున్నారని నెలల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారని సరైన ధ్రువపత్రాలు లేదని సాకుతో వెనక్కి పంపుతున్నారు. ఆర్టిఏ కార్యాలయంలో ఎదురుగా ఉన్న బ్రోకర్ల షాపుల నుంచి వచ్చే కాగితాలను నేరుగా తీసుకొని వారికి ఎలాంటి పరీక్ష లేకుండానే లైసెన్స్ జారీ చేస్తున్నారు. ఏజెంట్లు, ఎంవిఐలు కుమ్మక్కై వాహనదారులను దోచుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు దాసరి నరేష్, పల్లకొండ శ్రీకాంత్, అల్లే అనిల్, చిలుక జంపన్న లు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.