సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి
ఈ69న్యూస్ జనగామ జులై 25
జనగామ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కంప్లైంట్ మాఫియా టీం ఏర్పాటు చేసుకొని జనగామ పట్టణంలో ఇల్లు కట్టుకుంటున్న పేద మధ్యతరగతి ప్రజలను బెదిరిస్తూ టీబీపాసులో అప్లై చేసుకొని అనుమతులు పొందిన వారిని అనేక కుంటి సాకులు చూపుతూ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు.ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. అధికార పార్టీ నాయకులు చెబితే ఒక తీరుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు ఏమైనా వారి దృష్టికి సమస్యలు తీసుకపోతే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా నాంచుడు దొరనితో వ్యవహరిస్తూ అక్రమాలకు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు.శ్రీధర్ రెడ్డి పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి అదే రకంగా మున్సిపల్ ఉన్నతాధికార దృష్టికి తీసుకుపోనునట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి ఒక ప్రకటనలో తెలిపారు.