పరారీలో నిందితులు
గార్ల పుట్టకోట బజారులో ఘటన.
మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో వ్యక్తి హత్య గావించబడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రంలోని. పుట్టకోట బజారులో జరిగింది.. స్థానికంగా అద్దెకు నివాసముంటూ, ఓ ప్రైవేట్ కాలేజీలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా , తిమ్మినేని పాలెం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు( 60)ను ఇద్దరు వ్యక్తులు హత్య చేసారని ప్రాధమికంగా అందుతున్న సమాచారం… విషయం తెలుసుకుని హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ బాధావత్ రవినాయక్ ఘటనా స్థలాన్ని
పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
