అక్రిడేషన్స్ మంజూరు చేయాలని జర్నలిస్టుల తహసీల్దార్ కు వినతీ

పోటోరైటఫ్…నందిగామ లో తహశీల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు
అక్రిడేషన్స్ మంజూరు చేయాలని జర్నలిస్టుల తహసీల్దార్ కు వినతీ
అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నందిగామ జర్నలిస్టులు సోమవారం నందిగామ తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘాలు నాయకులు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల కు అక్రిడేషన్స్ మంజూరు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అక్రిడేషన్స్ కమిటీ లో జర్నలిస్టుల సంఘాలను సభ్యులు గా తీసుకోవాలని కోరారు. కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, పోజిటివ్ వచ్చిన జర్నలిస్ట్ కు రూ.25 వేలు చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు కట్టించాలని , హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.