అఖిల భారత రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు CPM & CPI

అఖిల భారత రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు CPM & CPI మరియు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు
స్టేషన్ ఘనపూర్:-అఖిల భారత కిసాన్ మోర్చా సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా ఈ రోజు భారత్ బంద్ కార్యక్రమం మండల కేంద్రంలోనిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల కొండల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత నవంబర్ 26న ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ఉద్యమం నేటికీ120వ రోజులకు చేరింది. సుమారుగా 300మంది రైతులు ఈ పోరాటంలో ఢిల్లీ సరిహద్దు లో గల నిరసన ప్రదర్శనల టెంట్ ల వద్దే ప్రాణత్యాగం చేశారు. అయినా మన ప్రదాని నరేంద్ర మోదీగారు ఒక్కసారి కూడా ఆ రైతులతో మాట్లాడ లేదు. దేశ రైతాంగం మొత్తం తీవ్ర పోరాటంలో ఉంటే ఇంత నిర్లక్ష్యంగా ప్రధాని వ్యవహరించడం దారుణం.
బ్యాంకులు, lic, Insurance, Railway, industries, BSNL రోడ్లు, విద్యుత్ వంటి సంస్థలను అమ్మేస్తోంటే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్న నిరుద్యోగులకు, భవిష్యత్తులో ఇంక ప్రభుత్వ ఉద్యోగాలే రావు. ప్రభుత్వ సంస్థలంటే ప్రజల ఆస్తులు వాటిని అభివృద్ధి చేయాలి కానీ అమ్మేస్తుంటే అమ్మకానికా మనం ఈ ప్రధానిని ఎన్నికున్నది? భవిష్యత్తు తరాల మాటేమిటీ. గతంలో ప్రైవేటు రంగంలో ఉన్న వాటినే ప్రభుత్వపరం చేశారు
ఇప్పటికీ ఆరు లక్షల కంపెనీలు మూసేశారు. దాదాపు కోటి మంది ఉద్యోగాలు పోయాయి. ఉన్న ఉద్యోగులను ఎప్పుడైనా ఎవరికి చెప్పకుండా తొలగిం చేయవచ్చు. “హయ్యర్ అండ్ ఫైర్” విధానంలో అవసరం ఉంటేనే పని లోనికి తీసుకోవాలి. ఆ వేంటనే నిర్దక్ష్యంగా తొలగిం చేయవచ్చు. అని కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్ లను తీసుకువచ్చి మనిషిని మనిషిగా కాకుండా బానిస గా మార్చి ప్రైవేటుకు కార్మికులను బలిస్తున్నారు.
గతంలో ఇలానే ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడి కార్మికులు హక్కులు చట్టాలు సాధించుకుంటే దానిని హరిస్తున్నారు. మరలా పాత చట్టాలనే మోదీ పునరుద్దరించాలి వెనక్కు తీసుకుపోతున్నారు. ప్రపంచ దేశాలు వారానికి ఐదు రోజులు, పని గంటలు తగ్గిస్తూంటే మన ప్రభుత్వం మేము నియతృత్వాన్నే అమలు చేస్తామంటుంది. అలాగే పెట్రోల్ డిజీల్ గ్యాస్ పై ప్రభుత్వ నియంత్రణ ఉన్నాళ్లు ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఎత్తేసిన తరువాత కూడా ఇంత ధరలు లేవు. కానీ బిజెపి ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేసి ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని అంతర్జాతీయంగా ముడి చమురు తగ్గినా మన దగ్గర ధర పెరుతునే ఉంది. ఇలా వసూలైన పన్నులను కార్పోరేట్లకు రుణాలు మాఫీ, రాయితీలు, పన్నులు మాఫీ పేరుతో వారికే దోచిపెడుతుందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలోCPM మండల కార్యదర్శి కొడపాక యాకయ్య, CPI మండల కార్యదర్శి కూరపాటి విజయ్, AISF చింత జగదీష్ రైతు సంఘం మండల కార్యదర్శి గట్ల మల్లారెడ్డి మండల కమిటీ సభ్యులు గుర్రం వెంకట్ నర్సు,శాఖా కార్యదర్శులు వంగ పండ్ల సోమయ్య, బొంకురి రామచంద్రు, చట్ల రాజు, కత్తుల రాజు (సముద్రాల) gmps మండల కార్యదర్శి కరుణాకర్,kbps అధ్యక్ష & కార్యదర్శులు చిలుముల భాస్కర్, మంద మహేందర్, DYFI మండల నాయకులు ఉల్లి రంజిత్, శాతపురం రవి, పోలాసు పరమేశ్వర్, పోలాసు సూరి,బొంకురి తిరుపతి, బొంకురి దిలీప్, బొంకురి రాజు, CPM నాయకులు కుంభం రాజు, మారబోయిన మల్లేష్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.