హనుమకొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్మెంట్ లో తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏ ఐ డి ఎస్ ఓ, ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తా నుంచి అశోక జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేసి చౌరస్తాలో రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో *డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిస్త్రీన్ సుల్తానా, ఏఐడీఎస్ఓ జిల్లా ఇంచార్జ్ ఎద్దుల సత్యనారాయణ మాట్లాడారు…. కేంద్ర ప్రభుత్వం గతంలో దేశ రక్షణ రంగంలో కి 50 శాతం పైగా ఎఫ్ డీ ఐ, ప్రైవేటు, కార్పొరేట్ పెట్టుబడులను ఆహ్వానించి రక్షణ రంగాన్ని గాలికి వదిలేసిందని మళ్లీ ఇప్పుడు ఆర్మీ రిక్రూమెంట్ లోకి అగ్నిపధ్ పథకం తెచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని, ఈ పథకం చాలా మోసపూరితమైనదని, ఆర్మీ సర్వీస్ కు ఎంపికైన తర్వాత అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహించిన అందులో కార్పస్ ఫండ్ పేరు తో మూడోవంతు గుంజుకొని నాలుగేళ్ల తర్వాత వారికి ఎలాంటి పెన్షన్, గ్రాట్యుటీ లాంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ల పేరు మీద జమ చేసుకున్న ఫండ్ కు కొంత అదనంగా ఇచ్చి ఇంటికి పంపడం అంటే ఆర్మీ వ్యవస్థను కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఇచ్చేయడమే అవుతుందని,అగ్ని పథ్ విధి విధానాల వల్ల నిరుద్యోగులకు ఆర్మీలో పని చేద్దాంమనే ఆశలు లేకుండా పోతున్నాయి. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులు గా మారే అవకాశం ఉందని, తక్షణమే రద్దు చేయాలని,డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కోశాధికారి బొల్లారపు సంపత్, జిల్లా సహాయ కార్యదర్శి వల్లెపు లక్ష్మణ్ , జిల్లా ఉపాధ్యక్షురాలు ఏ. సంధ్య జిల్లా కమిటీ సభ్యులు పల్లకొండ శ్రీకాంత్, జిల్లా నాయకులు దాసరి నరేష్, ఏ ఐ డి ఎస్ ఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాంసింగ్, కృష్ణ, డివైఎఫ్ఐ నాయకులు జంపయ్య, శ్రీను, పావని, త్రివేణి,శ్వేతా, ఆశా, శివాని, శైలజ, రమాదేవి,లు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.