కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు ప్రకటించటం సరైనది కాదు అని ఈ అగ్నిపథ్ ను పూర్తిగా రద్దు చేయాలని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ మాట్లాడుతూ ఈ అగ్నిపథ్ ఒక కుట్ర అని, సైన్యంలో కూడా కాంట్రాక్ట్ పద్దతి తీసుకొచ్చి దేశాన్ని రక్షించే సైనికులను కూడా ప్రవేట్ పరం చేయటమే అన్నారు ఇప్పటికే అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేసినట్లే సైన్యాన్ని కూడా ప్రవేట్ పరం చేసే కుట్ర అన్నారు . ఇప్పటికీ ఆర్మీ నియామకాలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత జీవితాలతో ఆటలడటం మానుకోవాలి. నిన్న జరిగిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. కాల్పులలో చనిపోయిన రాకేష్ కుట్టుంబానికి నష్ట పరిహారం చెల్లించాలి.. ఈ ఆందోళనను కూడా రాజకీయం చేయటం మానుకొని అగ్ని పథ్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.