Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

ఆర్మీ అభ్యర్థుల పై కాల్పులు జరిపిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలి, నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలి..

ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు డిమాండ్ చేశారు..

ఖమ్మం :- భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్.ఎఫ్.ఐ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ లో తీసుకోచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని నిర్మల్ హృదయ్ స్కూల్ ఎదుట P.M మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది… ఈ సందర్బంగా ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వీ. మధు మాట్లాడుతూ :- కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ విద్రోహక చర్యలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి.. గతంలో దేశ రక్షణ రంగం లోకి 50 శాతానికి పైగా ఎఫ్ డి ఐ, ప్రైవేటు, కార్పొరేట్ పెట్టుబడులను ఆహ్వానించి దేశ రక్షణ రంగాన్ని గాలికొదిలేసింది. మళ్లీ ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ లోకి అగ్నిపథ్ పథకం తెచ్చి దేశ ఆర్మీ, నిరుద్యోగ యువతను మోసానికి గురిచేస్తున్నది. ఈ పథకం చాలా మోసపూరితమైనది ఆర్మీ సర్వీస్ కు ఎంపిక అయిన తరువాత అతి తక్కువ వేతనంతో 30 నుండి 40 వేల తో విధులు నిర్వర్తించి అందులో కార్పస్ పండ్ పేర మూడవ వంతు గుంజుకొని నాలుగేళ్ళ తరువాత వారికి ఇలాంటి పెన్షన్, గ్రాట్యుటీ లాంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళ పేరుమీద జమ చేసుకున్న పండ్ కు కొంత అదనంగా ఇచ్చి ఇంటికి పంపడం అంటే ఆర్మీ వ్యవస్థను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కు ఇచ్చేయడమే అవుతుంది. అగ్నిపత్ పథకంలోని విధివిధానాలు వల్ల నిరుద్యోగులను ఆర్మీ జవాన్లకు ఆర్మీ లో పని చేద్దామనే ఆశలు లేకుండా పోతాయి. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మిగిలిపోతారు. అగ్నిపథ్ పథకం మోసపూరిత పథకం… గత ఎన్నికల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. తన హామీ ప్రాకారం 14 కోట్లు ఉద్యోగాలు కల్పించాలి. ఆ హామీ ఏమైంది అని ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులు అంటూ ముద్ర వేసి నిర్బంధం పెంచుతున్నారు.. సికింద్రాబాద్ లో నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై రైల్వే పోలీసులు కాల్పులు, లాఠీచార్జి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, చనిపోయిన నిరుద్యోగులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుడుం ప్రవీణ్, ఖమ్మం టౌన్ కన్వీనర్ తరుణ్, యశ్వంత్, రామకృష్ణ, దినేష్, గణేష్, సంతోష్ రెడ్డి, నితిన్ తదితరులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.