అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలి -ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నయాబజార్ కాలేజ్ ఎదుట అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని, సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తున్న వారి పై కాల్పులను విరమించాలనీ NCC విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రాణపు మధు మాట్లాడుతూ :- మిలిటరీ ఉద్యోగాలకు 21 నుండి 23 వయస్సు 2 సంవత్సరాలు సడలింపిస్తూ ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలను 4 సంవత్సరాల కాలం పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే నిర్ణయం సరైనది కాదన్నారు.. గత 2 సంవత్సరాలుగా సైనిక ఉద్యోగాల నియామకం చేపట్టకుండా ఒక్కసారిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకై అగ్నిపథ్ తీసుకురావడం పనికిమాలిన చర్య అనీ, ఈ నిర్ణయంతో లక్షలాది మంది సైనిక అభ్యర్థులు నష్టపోతారన్నారు.. నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపారనీ,ఇద్దరు నిరసనకారులు చనిపోయారనీ, పదుల సంఖ్యలో గాయపడ్డారనీ అన్నారు. దీనిని దేశ ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు పెట్టి,ఫలితాలు విడుదల చేయని నోటిఫికేషన్లు రద్దు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు సాయికుమార్, వినయ్,ఆది కిరణ్, శివ, రాఘవ విజయ్, అజయ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.