Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

నిరసనకారులపై పోలీసుల కాల్పులు ఖండిస్తున్నాం…

— *ఎస్.ఎఫ్.ఐ వికారాబాద్ జిల్లా, తాండూర్ ఆధ్వర్యంలో

ఖమ్మం టౌన్ :- భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) వికారాబాద్ జిల్లా తాండూర్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని, సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తున్న వారి పై కాల్పులను విరమించాలనీ NCC విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ తాండూర్ కార్యదర్శి టి. రాజశేఖర్ మాట్లాడుతూ :- మిలిటరీ ఉద్యోగాలకు 21 నుండి 23 వయస్సు 2 సంవత్సరాలు సడలింపిస్తూ ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలను 4 సంవత్సరాల కాలం పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే నిర్ణయం సరైనది కాదన్నారు.. గత 2 సంవత్సరాలుగా సైనిక ఉద్యోగాల నియామకం చేపట్టకుండా ఒక్కసారిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకై అగ్నిపథ్ తీసుకురావడం పనికిమాలిన చర్య అనీ, ఈ నిర్ణయంతో లక్షలాది మంది సైనిక అభ్యర్థులు నష్టపోతారన్నారు.. నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపారనీ,ఇద్దరు నిరసనకారులు చనిపోయారనీ, పదుల సంఖ్యలో గాయపడ్డారనీ అన్నారు. దీనిని దేశ ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు పెట్టి,ఫలితాలు విడుదల చేయని నోటిఫికేషన్లు రద్దు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ మెంబర్ అఖిఫ్ నాయకులు, నవీన్,సమీరా , తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.