అగ్నిపధ్ ను రద్దు చేయాలని, సికింద్రాబాదులో ఆర్మీ అభ్యర్థులపై కాల్పులు నిరసిస్తూ డివైఎఫ్ఐ నిరసన

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపధ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ… దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని,నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్‌ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. పెన్షన్‌ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని అన్నారు.
గత రెండేళ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేదు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ సైనికులను రిక్రూట్‌ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుంది. వారు ప్రైవేట్‌ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు నెట్టబడతారు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయని,ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ మన యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని , అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మోతె సతీష్, కంచర్ల కుమార్ స్వామి, దేవకీ, పల్ల కొండ శ్రీకాంత్, దాసరి నరేష్, శ్వేత అయోష, ఆశా శిరీషా రాధికా పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.