బియ్యం,దుప్పట్లు,వంట గిన్నెలు నిత్యావసర వస్తువులు అందించిన సీతక్క

నిన్న జరిగిన అగ్ని ప్రమాదం లో మూడు ఇండ్లు దగ్దం కాగా వారి కుటుంబాన్నీ పరామర్శించి బియ్యం,దుప్పట్లు,వంట గిన్నెలు
నిత్యావసర వస్తువులు అందించిన
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు గోవిందా రావు పేట మండలం ప్రాజెక్ట్ నగర్ గ్రామములోని మొట్ల గూడెం ఆదివాసీ గొత్తి కోయ గూడెం లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం లో 3 ఇండ్లు దగ్దం కాగా వారి కుటుంబాన్నీ పరామర్శించి క్వింటన్నర బియ్యం తో పాటు దుప్పట్లు,వంట గిన్నెలు ప్లేట్లు,వంట సామాగ్రి అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని సీతక్క గారు అన్నారు
అనంతరం ప్రాజెక్ట్ నగర్ గ్రామములోని శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానొత్ రవి చందర్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్
స్థానిక సర్పంచ్ సనప సమ్మయ్య
పసర సర్పంచ్ ముద్ద బోయిన రాము,
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి,మాజీ ఎంపీటీసీ కుర్సం కన్నయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు అలుగు బెల్లీ కన్నయ్య
వార్డు సభ్యులు చేరుకుల సురేష్
శ్రావణ్,యూత్ మండల కార్యదర్శి ఈక శేషు,చీమల లక్ష్మినారాయణ,రామ్మోహన్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.