అగ్ని ప్రమాద బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ

బాధిత 4 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం వంట సామాగ్రి దుప్పట్లు,తో పాటుదుస్తులు పంపిణీ చేసిన*
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి
ఈ రోజు తాడ్వాయి మండలం లోని లింగాల గ్రామములో మొన్న జరిగిన అగ్ని ప్రమాదం 4 ఇండ్లు పూర్తిగా దగ్దం కాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ఒక్కో కుటుంబానికి 25 కేజి ల బియ్యం వంట సామాగ్రి,గిన్నెలు దుప్పట్లు,దుస్తులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల్ల
కుమారస్వామి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని తక్షణ సాయం ఒక్కో కుటుంబానికి 50వేల రూపాయలు అందించాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ జిల్లా నాయకులు ముదర కోళ్ల తిరుపతి,యూత్ కాంగ్రెస్ గోవిందా రావు పేట మండల అధ్యక్షుడు చింత క్రాంతి కుమార్
స్థానిక సర్పంచ్ మౌనిక, మాజీ ఎంపీటీసీ రాజు,నర్సింహా రావు
జబ్బార్ ఖాన్, బుక్య మధు,అనిల్
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.