అట్టహాసంగా ఏ.సి.రెడ్డి నరసింహ్మారెడ్డి 31వ వర్ధంతి

దోపిడీ, అణిచివేతకు వ్యతిరేఖంగా తెలంగాణ ప్రాంతంలో భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం పీడిత ప్రజల పక్షాన జరిపిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని చరిత్రలో సువర్ణాక్షరములతో వ్రాయబడిందని జనగామ గడ్డపై సాయుధపోరాటంకు ముందుండి నడిపించిన ప్రజానేత, ఉద్యమ సూర్యుడు, త్యాగశీలి, అమరజీవి కామ్రేడ్ ఏ.సి.రెడ్డి నర్సింహ్మరెడ్డి అని వారి 31వ వర్ధంతి సభలో Cpm రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణ కేందంలోని నెహ్రూపార్క్ వద్దగల కామాక్షి పంక్షన్ హాల్ నందు ఎ.సి.రెడ్డి నర్సింహారెడ్డి గారి 31వ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభ ప్రారంభానికి ముందు స్థానిక బస్టాండ్ చౌరస్తా నుండి డప్పు కళాకారుల ప్రదర్శన బృందంతో, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకోవడం జరిగింది. అనంతరం సభా అధ్యక్షులుగా మోకు కనకారెడ్డి వ్యవహరించగా ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిధిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ గారు, పార్టీ సీనియర్ నాయకులు గంగసాని రఘుపాల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తమ్మినేని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, పీడిత ప్రజలపక్షపాతి, మాజీ ఎమ్మెల్యే అమరజీవి ఏ.సి.రెడ్డి నర్సింహారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు సమర్పించడం జరిగింది. అనంతరం తమ్మినేని వీరబద్రం మాట్లాడుతూ ఏ.సి.రెడ్డి నర్సింహ్మరెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పాల్గొని నైజాం సర్కారుకు, దొరలకు ఎదురొడ్డి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తని తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట సమయంలో రజాకార్లు జరిపిన దాడిలో ఏ.సి.రెడ్డి కుడి కాలు తొడలో బుల్లెట్ దిగినప్పటికీ నైజాం సైన్యాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన ఉద్యమ సూర్యుడని అన్నారు. సాయుధ పోరాటం సందర్బంగా తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల భూములు పంచబడ్డాయని, 4వేల మంది అమరులైనారని తెలిపారు. సాయుధ పోరాటం ఫలితంగా ప్రభుత్వం భూసంస్కరణల చట్టం తేవడం జరిగిందని, అంతేకాదు దున్నేవానికి భూమి అనే నినాదం ఆచరణలోకి వచ్చిందన్నారు. ఏ.సి.రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్బంగా స్వంత ఆస్తులుగాని, భూములు సంపాదించుకోలేదన్నారు. అలాగే పెళ్లి చేసుకుంటే పార్టీకి, ఉద్యమాలకు ఆటంకమని భావించి పెళ్లి చేసుకోకుండా బ్రతికిన నిస్వార్ధ, నిరాడంబర వ్యక్తని తెలిపారు. ఏ.సి.రెడ్డి మరణించే నాటికి వారి ఒంటిపై డ్రెస్సుతోపాటు అధనంగా మరొక డ్రెస్సు మాత్రమే కల్గిన త్యాగశీలి అన్నారు. ఏ.సి.రెడ్డి మరణించి 31సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా మనమధ్యే ఉన్నట్లుఉండని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం మత్తు రుద్ది ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగోట్టి పాలన దాగిస్తుందని విమర్శించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు, బీజేపీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు రగిలిస్తూ ప్రజా హక్కులను, రాజ్యాంగం విలువలను కాలరాస్తూ, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు. దేశ GDP గణనీయంగా పడిపోవడంతో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడుతుందని తెలిపారు. నీళ్లు నిధులు, నియామకాల లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన TRS ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్రంలో అధ్వానంగా పరిపాలన చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలొచ్చినప్పుడే KCR కు ప్రజలు గుర్తొస్తారని తెలిపారు. ఎన్నికల్లో గెలుపుకోసం KCR దళిత బందు పథకం ప్రవేశపెట్టడమే, ఇది కేవలం ఎన్నికల స్టoట్ మాత్రమేనని విమర్శించారు. దళితుల అభివృద్ధికి Cpm వ్యతిరేఖం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన మేరకు పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలను ఇవ్వాలని, గిరిజనుల, ఆదివాసులపైన ప్రభుత్వ నిర్బంధాన్నీ ఆపివేయాలని డిమాండ్ చేశారు. ధరణిలోని లోపాలను తక్షణమే సరిచేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోహిన రైతులకు లక్ష రూపాయలు పంట నష్టపరిహారం అందించాలని తెలిపారు. అలాగే వరద ముప్పుతో అన్ని కోల్పోయి నిరాశీయులైన ప్రజలకు ఆదుకోవాలని అన్నారు. గత ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్న విఆర్ఎ ల సమస్యలు పరిష్కారం చేయాలని లేనియెడల సిపిఎం విఆర్ఎ ల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి అవకాశం ఉంట్టుంది తప్ప పెన్షన్లు, రైతుబందు, దళితబందు పథకాలు కావని విమర్శించారు.  పెన్షన్లు, రైతు బందు పథకాలే రానున్న ఎన్నికల్లో గెలిపిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని హెద్దేవా చేశారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుంటుతుందని అన్నారు. సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారంకై రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఏ.సి.రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఈ మహనీయుని స్పూర్తితో రాష్ట్రంలో, జిల్లాలలో ప్రజా పోరాటాలు, ఉద్యమాలపై పార్టీ నిలిచినప్పుడే ఏ.సి.రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించినట్టవుతుందని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ రంగం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వేణు, ప్రముఖ న్యాయవాది, సాదిక ఫౌండర్ ఎం.డి. సాధిక్ అలీ, శ్రీశ్రీ కళావేదిక అనిశెట్టి ప్రభాకర్, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమన్న, గొల్లపల్లి బాపురెడ్డి, బోట్ల శేఖర్, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పోత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్, పొదల నాగరాజు, చిట్యాల సోమన్న, బెల్లంకొండ వెంకటేష్, భూక్యా చందునాయక్, మునిగేల రమేష్, కొడెపాక యాకయ్య, ఎన్నకుస కుమార్, ఎం.డి. అజారోద్దిన్, షబానా, సుంచు విజేందర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, పట్టణ కమిటీ సభ్యులు బిట్ల గణేష్, బాల్నే వెంకటమల్లయ్య, కళ్యాణ లింగం, పందిళ్ల కల్యాణి, మంగ బీరయ్య, పల్లెర్ల లలిత, మండల కార్యదర్శులు గంగాపురం మహేందర్, బొడ్డు కర్ణాకర్, డివైఎఫ్ఐ నాయకులు దూసరి నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు దడిగే సందీప్, ధర్మబిక్షం, పార్టీ సీనియర్ నాయకులు గురజాల లక్ష్మినర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.