ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వాజేడు మండలం పెనుగొడు గ్రామానికి చెందిన ప్రజలు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి వారి సమస్యలను వివరించడం జరిగింది
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద గుట్టలు మధ్య ప్రజల కు దూరంగా అడవిని నమ్ముకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు అని పెను గోడు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వాజేడు మండల కేంద్రములో వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని పేనుగొడు నుండి వారిని బయటకు తీసుకురావాలని సీతక్క గారు ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారికి ఫోన్ లో పెనుగోడు సమస్యలు వివరించడం జరిగింది
