errabelli dayakar rao palakurthi

రోడ్ల వెడల్పుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
    ఈ69న్యూస్ పాలకుర్తి మే01
    జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో ప్రధాన కూడలి,రోడ్డు వెడల్పు,సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రపంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివిధ పార్టీలు,వ్యాపార వర్గాలు,ప్రజలతో కలిపి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అత్యంత వెడల్పైన రోడ్లు అభివృద్ధికి నిదర్శనమని,సువిశాలమైన రోడ్లు సుందరీకరణకు అస్కారమిస్తాయని,సిద్దిపేట తర్వాత అంత విశాలమైన రోడ్లు పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయని అన్నారు.
    పాలకుర్తి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం,మొదట్లో కొంత ప్రతిఘతన వచ్చినప్పటికీ ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారు.విగ్రహాలను తొలగించాలని మాకు లేదు.ప్రముఖుల విగ్రహాలు మనకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయి,అయితే పాలకుర్తి ప్రధాన కూడలిలోని విగ్రహాలను శాశ్వతంగా తొలగించడం లేదు తాత్కాలికంగా జరిపాం.త్వరలోనే వాటిని సముచిత స్థానం లో ఏర్పాటు చేస్తాం అని అన్నారు.రాజీవ్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి వారు అంటే అందరికీ గౌరవమే,రాజీవ్ విగ్రహం తో పాటు అదే స్థానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది,అప్పటివరకు అందరూ ఓపిక పట్టాలి అని,రోడ్ల వెడల్పు సుందరీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలిపారు.వాళ్లకు మంత్రి సమాధానమిచ్చారు.
    ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానికంగా వివిధ పార్టీల నేతలు,వ్యాపారులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.