errabelli news telugu news rain news

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి

చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్దకు వెళ్ళవద్దు

విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలి

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు

వర్షాల తర్వాత పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరన్స్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని వరంగల్ నగరం, ఉమ్మడి జిల్లా అధికారులకు దిశా నిర్దేశం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయి. వర్షాలు బాగా కురుస్తున్న కారణంగా,
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజా ప్రతినిధులు, అదికారులు అందుబాటులో ఉండి సమన్వయంతో పని చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని మంత్రి ఎర్రబెల్లి సూచనలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, వర్షాకాల సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశిచారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల పరిస్థితి పై మంత్రి ఆరా తీశారు. వెంటనే జిల్లా అధికారులు, dpo లు, ఎంపిడిఓ లు, ఎంపీఓ లు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అలెర్ట్ గా ఉండాలన్నారు.

గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో కృషి చేసి ఏ చెరువు గాని, రోడ్డు గాని, తెగిపోకుండా చూడాలని అయన కోరారు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని అయన కోరారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలని అయన కోరారు. భారీగా వర్షం పడుతున్న సందర్బంగా ముందు జాగ్రత్తగా చర్యగా తాత్కాలికంగా ఆ ప్రాంతాలో విద్యుత్ ను నిలిపివేసి నష్టాన్ని నివారించాలని అన్నారు.

ప్రజలు సైతం వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని, రోడ్ల మీదకు రావద్దని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే…జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతోనూ…

జనగామ జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపి రెడ్ అలర్ట్ ప్రకటించిందని మంత్రి తెలిపారు.

వాగులు చెక్డ్యాంలు చెరువులు కుంటలు మత్తడి పోసి అవకాశమున్నందున వాటి దగ్గరికి ప్రజలెవ్వరూ పోకుండా ఉండాలని సూచించారు

గంట గంటకు పాలకుర్తి నియోజకవర్గ పరిస్థితిని తెలుసుకుంటానని మంత్రి తన పాలకుర్తి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులకు చెప్పారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.