చింతా చంద్రారెడ్డి వెంకట్రావమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి రక్తదానం.
అత్యవసర సమయంలో రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమే – ఎంపీపీ, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతా కవిత రాదారెడ్డి.
రక్తదానం మహాదానం – రక్తదాతను అభినందించిన ఎంపీపీ,చింతా చంద్రారెడ్డి వెంకట్రావమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతా కవిత రాదారెడ్డి.
కోదాడ మండల పరిధిలో ప్రమాదానికి గురై అత్యవసర స్థితిలో ఉన్న ముండ్లపాటి మైసయ్య అనే వ్యక్తికి రెండు యూనిట్ల A పాజిటివ్ రక్తం అవసరం ఉండగా విషయం తెలుసుకున్న చింతా చంద్రారెడ్డి వెంకట్రావమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతా కవిత రాదారెడ్డి గారు వెంటనే స్పందించి రెండు యూనిట్ల రక్తాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, చింతా చంద్రారెడ్డి వెంకట్రావమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతా కవిత రాదారెడ్డి గారు రక్తదాతలను అభినందించి వారు మాట్లాడుతూ అత్యవసరం, ప్రాణాపాయ స్థితిలో రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమేనని రక్తదానం మహాదానమని రక్తదాతలు ముందుకు రావాలని రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి పరిస్థితి రాకుండా రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోరాదని రక్తదానం పై అవగాహన పెంచుకుని అండగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కూచిపూడి సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.