cpim

నోటిఫికేషన్లు లేకుండానే శానిటేషన్ పోస్టులు భర్తీ చేయడం సరైనది కాదు- సీపీఐ మండల కార్యదర్శి జువారిరమేష్

నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇప్పించిన ఏజెన్సీ,అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఏజెన్సీని వెంటనే రద్దు చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలి

ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 12

జఫర్ఘడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు జిల్లాలోని 4ఆరోగ్య కేంద్రాల్లో ఇటీవల అధికార పార్టీ నాయకుల అందండలతో నోటిఫికేషన్ విడుదల చేయకుండా భర్తీ చేయడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ మండల కార్యదర్శి జువారి రమేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అధికార పార్టీ నాయకులు అధికార యంత్రాంగంతో కుమ్మక్కై లక్షల రూపాయలు గడించి నోటిఫికేషన్లు లేకుండానే శానిటేషన్ పోస్టులు భర్తీ చేయడం సరైనది కాదని అన్నారు.రాష్ట్రంలో ఇటువంటి ఆగడాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.ఔట్ సోర్శింగ్ పోస్టుల ఎరచూపి అమాయక ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారని, ఇప్పటికైనా నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇప్పించిన ఏజెన్సీ పై, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీని వెంటనే రద్దు చేసి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.