అధిక ధరలకు హద్దు లేదు, ఏలటోనికి బుద్ధి లేదు -సిపిఎం జిల్లా కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వం సామాన్య జనం పై కక్ష గట్టినట్టు గా ప్రజలు వాడే ప్రతి వస్తువు ధర పెంచుతుంది. ఉప్పు పప్పు నూనె కూరగాయలు రిటైల్ ధరలు సుమారు 50 నుండి 60 శాతం వరకు పెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానికి వేసినట్లు రోజుకోసారి పెరుగుతూ ఇప్పటికే దాటాయి.
బల్కు డీజిల్ ధరలను పెంచింది డబ్బులు వస్తే వాడుకునే అత్యవసర మందుల పై కూడా ధరలు పెంచి పేదోళ్ళ ఉసురు తీస్తుంది. జ్వరం, గుండె ,మధుమేహం వంటి సామాన్య 850 రకాల మందుల ధరలు 10 శాతం పెంచింది. వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అదనంగా పెరిగిన మందుల ఖర్చు అవుతుంది. గృహ వినియోగ గ్యాస్ ధరను 50 రూపాయలు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2014లో 500 రూపాయలు సిలిండర్ల ధర నేడు వెయ్యి రూపాయలకు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలు ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు సైతం పెరిగాయి. ఇలా ఒకటేమిటి అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదు ఇవి అనర్హం అన్నట్లు ఉంది. కోవిడ్ దెబ్బకు తల తల మైన సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర ధరలు విలవిలలాడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సింది పోయి కరెంటు చార్జీలు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. అధిక ధరలు హద్దు లేదు, ఏలా టోనికి బుద్ధి లేదు అని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు విమర్శించారు. విద్యుత్ చార్జీలను 34 శాతం మేర పెంచింది. అసలే కరోనా కష్టంలో పనులు ఉపాధి పోయి బతుకులకు ధరల పెరుగుదల మరింత ఆగం చేస్తుంది. ఏమన్నా అంటే దూడ గడ్డి కోసం తాటి చెట్టు ఎక్కుతున్న అని చెప్పినట్టుగా ధరల పెరుగుదలకు కారణమని పెడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు తమ ధ్యేయంగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు .యుద్ధం ముందు కూడా ధరలు పెరిగాయి కదా పెరిగాయని ఎన్నికలు ఉంటే ధరలు పెరగవు .ఎన్నికల ముందు ఎక్కడ మోడీ గారు. ఎన్నికల మనం ఇస్తారు ఉత్తర ప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి ధరలు పెరగడం మళ్ళీ మొదలైంది. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్రోలు ఉత్పత్తులపై పన్నుల ద్వారా ఆదాయం 99 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.ఈ ఏడాది 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెట్రోల్ పనుల ద్వారా వచ్చింది .అంటే నాలుగు రేట్ల పన్నుల భారం మనపై మోపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన, తగిన సంబంధం లేకుండా పన్నులు విపరీతంగా పెంచుతూ మనం కొనే వాటి ధరలు పెంచుకుంటూ మనల్ని దోచుకుంటున్నారు. కోటాను కోట్ల సంపద శత కోటీశ్వరులు లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ వాళ్ళ ఆదాయాలు పెంచుతుంటారు .కరోనా కాలంలో పేదలు మధ్యతరగతి సామాన్య ప్రజలు ఆదాయాలు కూలిపోయి నిరుపేదలుగా మారారు .కానీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ధనవంతుల సంపద మాత్రం మరింత పెరిగింది. మోడీ ప్రభుత్వం మనకు చింతాకు పచ్చడి మెతుకులు పెట్టి, ధనవంతులకు బంగారు పళ్లెంలో ఇస్తున్నారు .కాకులను కొట్టి బిజెపి పార్టీ ధనవంతులకు పెడుతుంది. ధరలను తగ్గించాలని మన ప్రభుత్వాలకు లేదు. మనం మౌనంగా ఉంటే మరింత దోచుకుంటారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల భారం తగ్గాలంటే ఎదురుతిరిగి పోరాటం చేద్దాం.అంతులేని ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పల్లె పల్లె నిరసన కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతాం.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వేలిశెట్టి రాజయ్య, రజాక్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.