గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ లను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపి అభినందనలు

ఈరోజు రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ లను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపి అభినందనలు తెలియజేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగిరి సతీష్ గౌడ్, జిల్లా నాయకులు పొన్నం బిక్షపతి, బండి సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగిరి సతీష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గారు ఒక బీసీ మహిళా సర్పంచ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడిన సర్పంచ్ దంపతులను ఈ సందర్భంగా సన్మానించమన్నారు. 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల బిడ్డలే నీ గెలుపులో కీలక పాత్ర పోషించి, నీ పాదయాత్రలో సైతం అడుగులో అడుగులో అడుగై నిన్ను నడిపించి భుజాలపైన మోసిన సంగతి మర్చిపోయిన గండ్ర వెంకటరమణా రెడ్డి గారు, తక్షణమే బిసి సభ్యసమాజానికి క్షమాపణ చెప్పాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భుజాలపైన మిమ్మల్ని మోసి ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టిన భూపాలపల్లి నియోజకవర్గ బీసీ బిడ్డలకు, మిమ్మల్ని ఆ కుర్చీలో నుంచి దించడం పెద్ద విషయం కాదు అన్న సంగతి గుర్తెరిగి ప్రవర్తించాలని ఈ సందర్భంగా వారున్నారు. పదవిలోకి రాకముందు బీసీ ఇండ్లకివెళ్లి నేను మీ బిసి బిడ్డను అని చెప్పినవ్, దళితుల కాలనీలకు వెళ్లి నేను దళిత బిడ్డను అని చెప్పినవ్, బహుజనులందరికీ నేను బహుజనుల బిడ్డను అని మాయమాటలు చెప్పి, ఎమ్మెల్యే పదవి రాగానే చెప్పిన మాటలు అన్నీ మరిచిపోయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ప్రజాప్రతినిధులుగా గ్రామాలలో ఎన్నికైతే ఓర్వలేని నీ దురహంకారానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏ బీసీ నాయకుడిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినా, బహుజనులను ఏకంచేసి గ్రామాలలో ఎమ్మెల్యే ఎలా తిరుగుతారో చూస్తామని ఈ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే బీసీ సమాజానికి మరియు సర్పంచ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పొన్నం బిక్షపతి, బండి సుదర్శన్ పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.