జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక,ప్రైమరీ పాఠశాలలో అపరి శుభ్రత పేరుకు పోయి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం గ్రామ కమిటీ సభ్యులు గుండెబోయిన రాజు పేర్కొన్నారు.బుధవారం రోజు సిపిఎం గ్రామ కమిటీ సభ్యులు స్కూళ్లను సందర్శించారు.అనంతరం గుండెబోయిన రాజు మాట్లాడుతూ..హైస్కూల్,ప్రైమరీ స్కూల్ లలో మరుగు దొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని,సిథిలావస్థలో ఉన్నాయని,నీటి సౌకర్యం లేక అపరిశుభ్రంగా ఏర్పడ్డాయని,మరుగు దొడ్లు లేక విద్యార్థులు ముఖ్యంగా ఆడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని,భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడాని సింకులు లేక ఇబ్బంది పడుతున్నారని,స్కూల్ ఆవరణలో చెత్త పేరుకు పోయి విషపురుగులకు స్థావరంగా మారిందని,ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని,లేక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీష్ కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో వడ్లకొండ సుధాకర్,షంషోద్దీన్,వేల్పుల చిన్న రాములు,ఎం రాజు,వేల్పుల రవి,నక్క యాకయ్య,వి రాజు,బాషామియ జమాల్,యాకూబ్ జమాల్,సిహెచ్ నర్సింహులు,కె చంద్రయ్య,పెద్ద రాములు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.