వర్ధన్నపేట దవాఖానలో సాధారణ ప్రసవం అయిన మహిళకు కెసిఆర్ కిట్ పంపిణీ చేసిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి
వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానా ను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లు మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ప్రసవాలు జరుగుతున్న తీరు, ఇతర సదుపాయాలు, సమస్యలు తెలుసుకుంటున్న సమయంలోనే ఒక మహిళ నార్మల్ డెలివరీ అయిందని వైద్యులు చెప్పారు. దీంతో డాక్టర్లతో కలిసి, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఆ బాలింత దగ్గరకు వెళ్లి పరామర్శించారు. మంత్రి ఎర్రబెల్లి అప్పుడే పుట్టిన బాబు ను ఎత్తుకొని ముద్దు చేశారు. ఆ వెంటనే ఆ బాలింతకు ప్రభుత్వం అందిస్తున్న కెసిఆర్ కిట్ ను అందచేశారు. వైద్యులను అభినందించారు. ప్రభుత్వ దవాఖానలో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని మంత్రులు డాక్టర్లకు సూచించారు.