అప్పులు తట్టుకోలేక...రైతు ఆత్మ హత్య

వీరులపాడు మండల పరిధి లోని పెద్దాపురం గ్రామా నికి చెందిన బొజ్జ సదాశివరవు 45 శనివారం పొలంలో పురుగుల మందు త్రాగి మృతి చెందారు.
గత రెండు సంత్సరాలు క్రితం నుంచి వ్యవసాయం కలిసి రాక అప్పులో కూరుకుపోయి నట్లు
సమాచారం.సదాశివ రావు కు 2.76.సెంట్లు స్వతం పొలం ఉంది.ఈ ఏడాది 6 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి.,మొక్కజొన్న పంట సాగు చేసినా తుఫానులు వలన పంటలు దెబ్బతిటం తో దాదాపు 15 లక్షలు రూపాయలు అప్పులో కూరుకుపోయి నట్లు సమాచారం
ఈ అప్పులు ఎలా తీర్చాలని ఆలోచనాతోనే శనివారం పొలంలో పురుగులు మందు త్రాగి పొలంలో నే మృతి చెందారు. చుట్టు పక్కల రైతులు చూచి చెప్పటంతో పొలం వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు.
వీరుల పాడు పోలీస్ లు కేసు
నమోదు చేసుకొని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
సదాశివ రావు కు భార్య మాధవి ఒకే కుమారుడు వివేక్
ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
సహకార పరపతి సంఘంలో
3లక్షలూరుపాయలు అప్పు ఉన్నదని,బయట నుంచి 12 లక్షలు అప్పు చేసి వ్యవసాయ0 చేస్తున్నాడని,గత రెండు సంత్సరాలు నుంచి వ్యవసాయంలో కలసి రాలేదని,ఈ ఏడాది భారీ వర్షాలు కారణంగా పత్తి,మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో,చేసిన
అప్పులు ఎలా తీ ర్చాలో తెలియక రైతు గుండెపగిలి,దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ట్లు గ్రామస్తులు అంటున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.