మరిపెడ పోలీస్ స్టేషన్ లో బుదవారం జిల్లా ఎస్పి ఆ దేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా. ఆటో డ్రైవర్లకు, టాక్షి డ్రైవర్లకు సీఐ సాగర్ అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. అప్రమత్తతతో వాహనాలు నడుపకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు, ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు రవాణా నిబంధనలను తుచ తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎస్ ఏచ్ ఓ-ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ గారు మరియు ఏసై లు సంతోష్ & ఝాన్సీ, ఏ ఎస్సై సాంబ రావు తదితరులు పాల్గొన్నారు