#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69News

మోకు కనకా రెడ్డి సిపిఎం జనగామ జిల్లాకార్యదర్శి

జనగామ : సిద్ధాంతాన్ని ఆచరించి ఆదర్శకమ్యూనిస్టుగా కడవరకు నిలిచిన ఆదర్శ నాయకుడు కామ్రేడ్ మంతెన నారాయణ రెడ్డి జనగామ కేంద్రంలోని స్థానిక ఆఫీసులో నారాయణ రెడ్డి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి కనక రెడ్డి మాట్లాడుతూ చెప్పులు కూడా లేని పేదల బాధలను నిత్యం ప్రపంచానికి చాటేందుకు జీవితం చెప్పులు వేసుకోకుండా నడిచిన ఆదర్శ నాయకుడు కుందారం భూముల్లో ఎర్రజండా లు పాతి పేదలకు పంచిన మహానీయుడు అని కొనియాడారు జనగామ తాలూకాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి నిలబెట్టిన ప్రజా నాయకుడు అన్యాయం ఎక్కడ జరిగినా తప్పు చేసేది తన వాడైనా సరే న్యాయం వైపు నిలబడ్డ మహనీయుడు ప్రజల కోసం పని చేస్తూ ఎన్నో బెదిరింపులు ఎదుర్కొంటూ 22 గ్రామాల్లో అరుణ పతాకాన్ని అగ్ర గ్రామాన నిలిపిన నిర్మాణ నాయకుడు రైతు సంఘం కోసం అనేకమైన పోరాటాలు నిర్వహించాడు తన మీద అనేక మైనటువంటి దాడులు జరిగిన ఏనాడు బెదరకుండా మెదలకుండా ప్రజల వద్దకు వెళుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నినదించిన మహానాయకుడు కామ్రేడ్ మంతెన నారాయణ రెడ్డి ఆశయాల కోసం ఈ రోజు జనగామ జిల్లా ప్రజలు యువకులు వారి పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు. ఇర్రి అహల్య. బోట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి. భూక్య చందు నాయక్. సిపిఎం పట్టణ కార్యదర్శి. జోగు ప్రకాష. నాయకులు భాష పాక విష్ణు. గంగర బోయిన మల్లేష్ రాజ్. తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.