అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి

పెండింగ్ రేషన్ కార్డ్ దరఖాస్తులను పరిష్కరించి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో వెంగల్ రావు నగర్ డివిజన్ మధుర నగర్ లో ఈ రోజు నిరసన తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్ చంద్రశేఖర రావు , రాపర్తిఅశోక్ గారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులో కొత్తగా పెళ్లి అయిన వారు చేర్పులు మార్పులు మరియు పిల్లల పేర్లు ఎక్కించే విధంగా అడ్రస్సు చేంజ్ చేసే విధంగా కూడా ఏ ఎస్ ఓ ఆఫీసుకు వెళితే సాఫ్ట్వేర్ పని చేయట్లేదు. అని చెప్పేసి పంపిస్తున్నారని తెలపడం జరిగింది .పిల్లల క్యాస్ట్ ,ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు రేషన్ షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలని ఆ విధంగా ఇవ్వడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్లో తగ్గుతాయని తెలపడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల సమస్య రేషన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు . లేనియెడల సి ఆర్ ఓ ఆఫీస్ ముట్టడిస్తామని తెలపడం జరిగింది. అదేవిధంగా పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు తగ్గించాలి ఇవి పెరగడం వల్ల అన్ని రకాల వస్తువులపై ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అందులో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారని వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్ మంగ, సునంద ,బి లక్ష్మి, బి సుశీల ,అన్నపూర్ణ ,అనిత ,శోభ ,కవిత ,జయ శ్రీ, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.