janagama news

-మంతెన మణికుమార్
అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

జనగామ జిల్లా:
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమని అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంతెన మణికుమార్ అన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2022-24వ సంవత్సరాల గాను అర్హులైన విలేకరులు కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలుపగా వర్కింగ్ జర్నలిస్ట్ లు అందరూ అప్లై చేసుకున్నారని..
కానీ అక్రిడేషన్ కమిటీల సరైన నిర్ణయం లేక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విలేకరులను పూర్తిస్థాయిలో గుర్తించక అక్రిడేషన్ కార్డులు రాకుండా చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని..
డిపిఆర్ఓ కమిటీలో కొందరి మాటలు విని అర్హులైన జర్నలిస్టులను గుర్తించకుండా వారికి రావలసిన కార్డులు అందకుండా చేస్తున్నారని..
ఇప్పటికైనా కలెక్టర్, డీపీఆర్వో స్పందించి అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని..
ఇవ్వకుంటే ఉధృతంగా ఉద్యమం చేస్తామని..
అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.