అల్లాహ్ వైపు పిలుచుటలో భాగస్వాములు అవండి. -అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ తెలంగాణ ప్రచార కార్యదర్శి-షబ్బీర్ అహ్మద్
శనివారం రోజున హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం జమాత్ లోని దావతె ఇలల్లాహ్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రచార కార్యదర్శి ముహమ్మద్ షబ్బీర్ అహ్మద్ యాకూబ్ అధ్యక్షతన ప్రచార శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అహ్మదియ్య ముస్లిం జమాత్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ ముహమ్మద్ అక్బర్,ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ ముహమ్మద్ సలీం లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రంసంగించారు.వారు మాట్లాడుతూ నేటికి నూట ఇరవై సంవత్సరాలకు పూర్వం సర్వధర్మ సంస్కరణ కొరకు కలియుగ అవతార పురుషునిగా హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ అవతరించారని వారు యావత్తు ప్రపంచంలోని మానవులందరిని ఐకమత్యం చేయుటకు అహ్మదియ్య ముస్లిం జమాత్ ను స్థాపించడం జరిగిందని వారి తదనంతరం ఖలీఫాల పరంపర లో ప్రస్తుత ఐదవ ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహమద్ గారి నాయకత్వంలో నిజమైన ధర్మ ప్రచారం చేస్తుందని అన్నారు.ముగింపు ప్రసంగంలో మౌల్వీ షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ జమాత్ సభ్యులు మంచి నడవడిక అలవర్చుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచి సర్వ మానవాళిని అల్లాహ్ వైపు పిలుచుటలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రచార కార్యకర్త యాకూబ్,మౌల్వీ సయ్యద్ కరీం, వివిధ గ్రామాల మౌల్వీలు,రహీంపాష,యాకూబ్ కుర్రం ,హాఫిజ్ షరీఫ్,ప్రముఖులు సదర్లు, గ్రామస్థులు వలీ,అహ్మద్, మహమూద్,కరీం,తదితరులు పాల్గొన్నారు.
