అసత్య ప్రచారాలు చేస్తూ,పండిట్ ట్లను అయోమయంలోకి నెట్టేస్తున్నారు

TSUTF ఆఫీస్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఈరోజు, UTF పండిత మిత్రులు ,గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈమధ్య వాట్సాప్లో, వస్తున్నటువంటి పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ విషయంలో అనేక వివాదాలు సృష్టిస్తూ, కొందరు MLCగతంలో ఇచ్చిన, హామీని నిలబెట్టుకోవడం లేదని, ప్రభుత్వం పండిట్ల పోస్టులు అప్గ్రేడ్ చేస్తే ,తానే అడ్డుకుంటానని అన్నాడని, కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ,పండిట్
ట్లను అయోమయంలోకి నెట్టేస్తున్నారు.దానికి తెర దించుతూ, తేదీ :06.03.2019 న పండిట్ పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ బాధ్యత తీసుకొని వాటి అమలు కోసం కృషి చేస్తానని,అన్న మాటకు కట్టుబడి ఉన్నానని మరొకసారి వారు స్పష్టం చేశారు. వారు ఇచ్చిన హామీకి, పండిట్ మిత్రులు సంతృప్తి చెందడం జరిగింది. ఈ కార్యక్రమంలోTSUTF జిల్లా నాయకులు మరియు పండిత మిత్రులు పాల్గొన్నారు.అబద్ధపు ప్రచారాలు చేసేవారు ఇప్పటికైనా మానుకొని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పండిట్ మిత్రులు కోరారు .

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.