akber muslim palakurthi

రమజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ చేపించినచో ఇఫ్తార్ చేపించిన వారికి కూడా రోజా ఉన్నంత సమాన పుణ్యం లభిస్తుంది- ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదియ్య సర్కిల్ ఇంచార్జ్ ముహమ్మద్ అక్బర్
ఈ69న్యూస్ పాలకుర్తి మే01
పాలకుర్తి మండల కేంద్రములో అహ్మదియ్య ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో స్థానిక మస్జిద్ లో ఉపవాసం పాటించిన వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధన అనుసారం ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ చేపించినచో వారికి కూడా రోజా ఉన్నంత సమాన పుణ్యం లభిస్తుందన్న నమ్మకంతో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదియ్య ముస్లిం జమాత్ సర్కిల్ ఇంచార్జ్ ముహమ్మద్ అక్బర్ అన్నారు.సంఘం సభ్యులు ముహమ్మద్ ఖాజా,ముహమ్మద్ మశూక్ మరియు ముహమ్మద్ భాషా ఆధ్వర్యంలో అహ్మదియ్య ముస్లిము లందరికి శనివారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ పాల్గొని మాట్లాడారు.ఈ రంజాన్ మాసంలో ఆచరించిన సత్కార్యములు,పుణ్యకార్యములు,దాన ధర్మములు ఆ తరువాతి మాసంలలో కూడా కొనసాగించాలని అహ్మదియ్య ముస్లిం జమాత్ ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లాహు తాలా బి నస్రిహిల్ అజీజ్ గారు యావత్ మానవాళికి ముఖ్యంగా అహ్మదియ్య ముస్లింలకు సూచించారని అన్నారు.తదనంతరం అహ్మదియ్య ముస్లింలు సామూహికంగా తరావీహ్ నమాజ్(రమజాన్ మాస ప్రత్యేక ప్రార్థన)చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్,జిల్లా పూర్వ అధ్యక్షులు ముహమ్మద్ నజీర్,మోల్వి ముహమ్మద్ రహీముద్దిన్, జమాత్ ప్రచార కార్యదర్శి షబ్బీర్ అహ్మద్ యాకూబ్,లుక్మాన్,రియాజ్,రిజ్వాన్ మాషూక్,షరీఫ్ సాబ్,అబ్బసలి,ఇర్ఫాన్, యూసుఫ్,రేహన్,నూరుద్దిన్,యాకూబ్, స్త్రీలు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.