#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

దేవాలయాల వార్షిక ఉత్సవాలతో భక్తుల్లో ఆధ్యాత్మిక పెరుగుతుంది

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు .

ఆంజనేయస్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం లో అభయాంజనేయ స్వామి ఆలయ 19 వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెరుగుతుందన్నారు. భక్తిభావంతో ప్రజల మధ్య శాంతి సామరస్యాలు పెరుగుతాయన్నారు. ఆలయాల వార్షికోత్సవ వేడుకల్లో తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ కి అభినందనలు తెలిపారు. అనంతరం అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వనపర్తి రామయ్య, ఎంపీపీ చింతా కవిత రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, స్థానిక కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్, కందుల కోటేశ్వరరావు, సుబ్బారావు, మహిళా కమిటీ అధ్యక్షురాలు రోజా రమణి, మాధవి,ఆలయ కమిటీ సభ్యులు బెక్కం వెంకటేశ్వర్లు, మల్లు దుర్గా రెడ్డి, కుర్రి నరసయ్య, పల్లా వెంకటేశ్వర్లు, చిత్తలూరి రామయ్య, మల్లు బిక్ష్మా రెడ్డి, నరేష్, వీరయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు….

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.