jangama news local news

సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్

ఈ69 న్యూస్ జనగామ జులై 22

జనగామ పట్టణం ఐదో వార్డులోని బాణాపురం ఇందిరమ్మ కాలనీ రోడ్లపై వెలిసిన డబ్బా దుకాణాలు అలాగే కొన్ని ఇండ్లలో నిర్వహిస్తున్న బెల్టు షాపులన్నీ ఆకతాయి జులాయిలకు అడ్డాలుగా మారాయని వాటిపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పోలీస్ అధికారులు కోరారు.
శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కు ఏసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయనైనది.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి శివారు ప్రాంతమైన బాణాపురం అలాగే ఏసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీ ప్రాంతాలు రాత్రులు అయితే చాలు తాగుబోతులతో జులాయి వ్యక్తులతో బంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉందన్నారు.పోచమ్మ గుడి ముందర దేవాదుల కాలువ వెంబడి నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న ఇండ్లు తాగుబోతులకు కేంద్రంగా మారినాయని తెలిపారు. మహిళలు చిన్నపిల్లలు యువతీ యువకులు రోడ్ల వెంబడి నడవాలంటే జెంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోజువారీ కష్టం చేసుకుని రెక్కా ఆడితే డొక్కాడని పేద ప్రజలు నివసిస్తుంటారు.పేదలు నివసిస్తున్న కాలనీలలో సుమారు 10 వరకు బెల్ట్ షాపు నిర్వహించ బడుతున్నాయి.ఇవి ఇండ్ల మధ్యలో అలాగే రోడ్డుపైన డబ్బా దుకాణాలు బహిరంగంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.దీనివల్ల ప్రజలు మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా వెంటనే బెల్ట్ షాపులపై పోలీసు అధికారులు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించాలని అలాగే రోజుకు మూడు నాలుగు సార్లు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి తాగుబోతుల జులాయిల నుండి ప్రజల్ని కాపాడాలని కోరుతూ పిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు బూడిద అంజమ్మ పసులాది ఎల్లమ్మ పందిళ్ళ కళ్యాణి కొండ వరలక్ష్మి పసుల మంజుల మారబోయిన శివ ఆత్కూర్ ఎల్లయ్య బూడిద సంపత్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.