ఆగస్టు 8న, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెంకటస్వామి అధ్యక్షతన మైదిపట్నం లో జరిగిన కరపత్రం ఆవిష్కరణ సందర్భంగా* రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్* హాజరై. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజక వృత్తిదారుల సమస్యలపై ఆగస్టు “8”న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా క్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.పిలుపులో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ముఖ్యంగ రజక బందు ఏర్పాటు చేసి రూ: 10 లక్షలు రుణం అందించాలి ,మోడ్రన్ దోబీ ఘాట్ ల నిర్మాణానికి స్థలం కేటాయించాలి, ప్రభుత్వ ఆసుపత్రులు విద్యాసంస్థల వృత్తి పని కాంట్రాక్టు గా రజక వృత్తిదారులకు ఇవ్వాలి.నూతన రజక సొసైటీ లో రిజిస్ట్రేషన్ వెంటనే ఆన్లైన్లో చేయాలి .డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రజక వృత్తిదారుల కి ఇవ్వాలి, రజకుల ఉచిత విద్యుత్ పథకాన్ని lt2 నుండి lt4 కి మార్చాలి, అపార్ట్మెంట్ వాచ్మెన్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని , ఉచిత విద్యుత్తు లబ్ధిదారులు తమ అడ్రస్ మార్పు ఎడల విద్యుత్ అధికారులు జోక్యం చేసుకుని లబ్ధిదారులు కోరిన చోట విద్యుత్ మీటర్లు బిగించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్షులు చారగొండ వెంకటస్వామి మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి, జిల్లా వెల్ఫేర్ కమిటీ ని కలెక్టర్ సమక్షంలో వెంటనే ఏర్పాటు చేయాలని,* రజకులకు 5 లక్షల బీమా సౌకర్యం ఇవ్వాలని . చెరువు స్థలాలను కాపాడి రజకులకు ధోబి ఘాట్ లకు స్థలం కేటాయించాలని* వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యాదమ్మ.రమేష్ మోహన్ పద్మ, మంజుల, లక్ష్మి మాణిక్యమ్మ, వెంకటేష్, కేశవులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.