ఈ69వార్త జఫర్ఘడ్/ ఏప్రిల్4
పెట్రోల్,డీసెల్,గ్యాస్ ధరలు తగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జఫర్గడ్ మండలంలోని తీ గారం,కూనూరు,గ్రామాలలో ఆటోకు తాడు కట్టి వినూత్న రూపంలో నిరసన తెలిపారు.
తమ్మడపల్లి జి గ్రామంలో గ్యాస్ సిలిండర్ లతో ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు గుండెబోయిన రాజు,
మండల నాయకులు వడ్లకొండ సుధాకర్ పాల్గొని మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం సామాన్య జనం పై కక్ష గట్టినట్టుగా నిత్యవసర సరుకులపై 60శాతం వరకు ధరలను పెంచారని,పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశానికి మెట్లు వేసినట్లు రోజుకో మెట్టు ఎక్కుతున్నాయని,మెడికల్ షాపులో దాదాపు 850రకాల మందుల ధరలు పెంచారని,రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు,ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచి మరింత భారం మోపిందని,అధిక ధరలకు హద్దు లేదు,ఏలెటోనికి బుద్ధి లేదు అని విమర్శించారు.అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన,తగ్గినా సంబంధం లేకుండా పన్నులు విపరీతంగా పెంచుతూ పోతున్నారని,ధరలను తగ్గించే యోచన ఇరు ప్రభుత్వాలకు లేదని, ప్రజలు మౌనంగా ఉంటే మరింత దోచుకుంటారని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించాలంటే ఎదురుతిరిగి పోరాటం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ప్రభాకర్,నర్సింగోజు రాజు,నక్క యాకయ్య,వేల్పుల రవి,వేల్పుల చిన్న రాములు,ముఖెర గంగరాజు,యాతం సమ్మయ్య,బుల్లె దుడయ్య,సాగ యాదగిరి,శ్రీను,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు
