శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా పర్వతగిరి రాజును సస్పెండ్ చేయడం వెనకాల రాజకీయ కుట్ర ఉందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సర్పంచ్ అయినా రాజును రాజకీయంగా దెబ్బతీయాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకు చేందిన ఆత్మకూర్ గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను అధికార పార్టీలో చేర్చుకొని వారి ద్వారా అసత్యపు నివేదికలు తయారు చేసి
(డి ఎల్ పి ,
డి పి ఓ) అధికారులకు సమర్పించారు..
ఆ నివేదికలు జిల్లా కలెక్టర్ పరిగణలోకి తీసుకొని ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజును సస్పెండ్ చేయడం జరిగింది.
ఆత్మకూర్ లో గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ అభివృద్ధికై
రైతు వేదిక , శ్మశానవాటిక , డంపింగ్ యార్డ్, బృహత్ పల్లె పకృతి వనం , బతుకమ్మ ఆడుకునే స్థలం , అనేక గ్రామ అభివృద్ధి పనులు చేసాడు. అలాగే వ్యాపార సముదాయం కాంప్లెక్స్ నిర్మించి వాటిని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ద్వారా నే ప్రారంభించి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇలా గ్రామ ప్రజలకు న్యాయం చేసినందుకా…?? మీరు సస్పెండ్ చేసింది.
గత కలెక్టర్ ఆత్మకూర్ సర్పంచ్ చేసిన గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించి పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కన్నా ఆత్మకూరు సర్పంచ్ గ్రామ అభివృద్ధి పనులు చాలా త్వరగా పూర్తి చేశారని చాలా బాగున్నాయి
అని ఆమె అభినందించారు.కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ళకు అధికారులు ఈ విధంగా చేశారని భావించాల్సి వస్తుంది అన్నారు.
అధికార పార్టీ సర్పంచులు విధులు దుర్వినియోగం చేశారని మండల అధికారులు నివేదిక ఇచ్చినా వారిని కలెక్టర్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయినందున మాత్రమే ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ రాజును సస్పెండ్ చేయడం జరిగింది.
ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఓర్వలేకనే ఇలాంటి విశపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు.
ఇకనైనా అధికారులు సర్పంచ్ ను సస్పెండ్ చేసిన విషయంలో పునరాలోచించాలని లెనిఏడల న్యాయ పోరాటానికి సిద్ధం అవుతునె..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేపడతామని
ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో పిఏసిస్ చైర్మన్ కోరుకొండ రవీందర్ గౌడ్ , ఆత్మకూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయ్య కూమార్ ,
గుడేపాడ్ ఎంపిటిసి
బిరం రజనీకర్ , బిసి సెల్ అధ్యక్షుడు పూజారి రాము, ఎస్సీసెల్ అధ్యక్షుడు దెయ్యాల రమేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంద చంద్రమోహన్, వార్డ్ సభ్యులు రవి యాదవ్ , పిఏసిఎస్ డైరెక్టర్ల వీర వెంకటరమణ, కాంగ్రెస్ నాయకులు రమేష్,తిరుపతి, సందీప్ రఘు శ్యామ్ ‌ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.