ఆదర్శ యూత్ అసోసియే భరోసా ఇచ్చారు.షన్

వరంగల్ రూరల్ జిల్లా ,
ఆత్మకూర్ మండలం లోని హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన
షేక్ సలీం S%ఇమామ్ వయస్సు 40,

తురక కాశకు‌ చెందిన బండ కొట్టే నిరుపేద కుటుంబం.

ఇతను గత 4 సంవత్సరాల
నుండి అనారోగ్యానికి గురై మంచాన పడి నిన్న మరణించడం జరిగింది.
సలీం బండ పని చేస్తే గాని పూటగడవని కుటుంబం.
ఇప్పుడు అతని లేని లోటు ఆ కుటుంబానికి భారంగా తయారైంది.

అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

4సంవత్సరాలనుండి తల్లి ముంతాజ్ బేగం కూలి పని చేస్తూ పిల్లలను చూసుకుంటూ అటు
భర్తను హాస్పిటల్ చూపించుకుంటూ బ్రతుకు బండి లాగేది,

రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం,
పిల్లలు చదువుకుంటూ తల్లి తో పాటు కూలీపనికి వెళ్లేవారు.
ఇప్పుడు వాళ్లకు పెద్ద దిక్కు లేకపోయే సరికి కుమిలి పోతున్నారు.

షేక్ సలీం కుటుంబానికి ఎంతోకొంత సహాయం చేద్దామని,
హౌజుబుజుర్గు గ్రామ ఆదర్శ యూత్ అసోసియేషన్ వారు వారి కుటుంబానికి
50 కేజీల సన్న బియ్యం సహాయం చేస్తూ, ఎల్లప్పుడూ వారి కి తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
వారి పిల్లలకు ఓదార్చారు.

ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు
షేక్ ఖాసీం,
ఉపాధ్యక్షులు సయ్యద్ షరీఫ్,
మరియు యాకుబ్, హుస్సేన్,
అజ్మత్, యాకుబ్, సద్దాం, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.